‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ అవుతుందా.?

- June 02, 2022 , by Maagulf
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ అవుతుందా.?

‘రంగస్థలం’  సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తొలిసారి జత కట్టింది ముద్దుగుమ్మ సమంత. ఈ సినిమాలో ఆమె పోషించిన రామలక్ష్మి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రాణం పెట్టేసింది నిజంగానే సమంత ఆ పాత్రకు. తర్వాత మళ్లీ చిట్టిబాబు, రామలక్ష్మి కాంబినేషన్ అస్సలు సోదిలోకే రాలేదు.

చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే సమంత పేరు వినిపిస్తోందట. అదేంటీ.? ఈ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ వుంది కదా.. కైరా అద్వానీ.. అనుకుంటున్నారా.?

ఆగండాగండి. సమంతను హీరోయిన్‌గా కాదు. స్పెషల్ రోల్ కోసం అనుకుంటున్నారట. ఏడెనిమిది నిముషాల నిడివితో వుండే పాత్రట అది. సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రని అంటున్నారు. మొదట్లో ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ కానీ, నయనతార కానీ అనుకున్నారట.

కానీ, కొత్తగా సమంత పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ బ్లాక్‌తో కూడిన పాత్ర అనీ తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’లో సమంత యాక్షన్ టాలెంట్ చూశాకా, ఈ ఎపిసోడ్‌కి సమంత అయితే బాగుంటుందని డైరెక్టర్ భావిస్తున్నాడట. త్వరలోనే క్లారిటీ రానుంది.

మరోవైపు సమంత చేతిలో ‘శాకుంతలం’, ‘యశోద’ అను డిఫరెంట్ కాన్సెప్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ వున్నాయి. వీటితో పాటు, హిందీ, తమిళంలోనూ కూడా కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్ సమంతకు. ఈ నేపథ్యంలో శంకర్ సినిమా ఛాన్స్ తీసుకుంటుందా.? శంకర్ సినిమాలో నటిస్తే ఆ కిక్కు వేరే లెవల్. సో సమంత వదులుకునే అవకాశమే లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com