దివ్యాంగుల్ని అడ్డుకోవద్దు:DGCA

- June 03, 2022 , by Maagulf
దివ్యాంగుల్ని అడ్డుకోవద్దు:DGCA

న్యూ ఢిల్లీ: విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.దీనికి సంబంధించి తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇటీవల రాంచీలో వైకల్యంతో ఉన్న ఒక బాలుడిని విమానంలో ప్రయాణించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ అనుమతించని సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన DGCA ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించింది.ఈ అంశంపై విమానయాన సంస్థలకు కొన్ని సూచనలు చేసింది.

‘‘వైకల్యం కారణంగా ఏ వ్యక్తిని విమానంలో ప్రయాణించకుండా అడ్డుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి వ్యక్తి విమానంలో ప్రయాణించడం కారణంగా, తన ఆరోగ్యానికి హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ప్రయాణాన్ని నిరాకరించాలి. అది కూడా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వైద్యులు ప్రయాణికుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వాళ్లు విమానంలో ప్రయాణించవచ్చా? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని విమానయాన సంస్థలకు DGCA సూచించింది. ఈ అంశానికి సంబంధించి కాలానుగుణంగా నిబంధనల్లో మార్పులు తెస్తామని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com