వాహన బీమా ధరల్లో పెంపు లేదు: సీఎంఏ

- June 04, 2022 , by Maagulf
వాహన బీమా ధరల్లో పెంపు లేదు: సీఎంఏ

మస్కట్: వాహన బీమా ధర పెంపునకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (సీఎంఏ) ప్రకటించింది. ఫుల్ లేదా థర్డ్-పార్టీ వాహన బీమా ధరల పెరుగుదల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను క్యాపిటల్ మార్కెట్ అథారిటీ ఖండించింది. వాహన బీమా ధరలు అథారిటీ ఫాలో-అప్, సమీక్షకు లోబడి ఉంటాయని సీఎంఏ స్పష్టం చేసింది. సమగ్ర లేదా థర్డ్-పార్టీ వాహన బీమా ధరలలో మార్పును అభ్యర్థిస్తూ బీమా కంపెనీల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని సీఎంఏ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com