స్మోకింగ్ మానేయడానికి సాయం చేసే క్లినిక్ లు ప్రారంభం
- June 05, 2022
కువైట్: స్మోకింగ్ ను మానేయడానికి సహాయపడే 11 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ ప్రాంతాలలో ప్రారంభించింది. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ దీనా అల్-దుబైబ్ వీటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విభాగం, జాతీయ కార్యక్రమం సహకారంతో క్లినిక్‌లు స్మోకింగ్ బాధితులకు సహాయాన్ని అందజేస్తాయన్నారు. అబ్దుల్లా అబ్దుల్‌హాది హెల్త్ సెంటర్స్, అలీ తునయన్ అల్-ఘనిమ్ మరియు క్యాపిటల్ హెల్త్ డిస్ట్రిక్ట్‌లోని అబ్దుల్ రెహమాన్ అబ్దుల్-ముఘ్నీ, ఫర్వానియా జిల్లాలోని అల్-రబియా హెల్త్ సెంటర్, రుమైథియా హెల్త్ సెంటర్ , హవల్లి జిల్లాలో హవల్లీ అల్-ఘర్బీ, జహ్రా జిల్లాలో అల్-ఓయోన్, అల్-అహ్మదీ హెల్త్ డిస్ట్రిక్ట్‌లోని అల్-ధహర్, తూర్పు అల్-అహ్మదీలలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ లు స్మోకింగ్ ను మానేయడంలో బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తాయని డాక్టర్ దీనా అల్-దుబైబ్ తెలిపారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







