ఉద్యోగుల నుండి వీసా మరియు నియామక ఖర్చులను పరిశ్రమలు వసూలు చేస్తాయా?
- June 05, 2022
ప్రశ్న: మూడు నెలల క్రితం దుబాయ్ కు చెందిన కంపెనీలో చేరాను. ఒప్పందం ప్రకారం జీతంలో 50 శాతం కంటే తక్కువ జీతాన్ని నాకు చెల్లించడం జరిగింది. కొన్ని కారణాల దృష్ట్యా నా ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను.కానీ నేను రాజీనామా చేసే 6 నెలలు ఉద్యోగ వీసా ఖర్చులు కోసం Dh6,000 చెల్లించాలి అని నా యజమాని చెబుతున్నాడు, ఇది చట్ట ప్రకారం న్యాయమేనా ? కంపెనీ నుండి రావాల్సిన జీత బకాయిలను ఎలా వసూలు చేసుకోవాలో వివరించగలరు.
సమాధానం: మీరు పైన పేర్కొన్న సమాచారం ప్రకారం, దుబాయ్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొబేషన్ కాలంలో ఉన్నారు. కాబట్టి మీ సమస్య ఫెడరల్ డిక్రి చట్టం పరిధిలోని ఉపాధి చట్టం 2021 మరియు క్యాబినెట్ నిబంధనలతో కూడిన ఉద్యోగి సంబంధాల రెగ్యులేషన్ 2021 ద్వారా పరిష్కారం దొరుకుతుంది.
యూఏఈలో ఒక ఉద్యోగి కనీసం14 పని దినాలైన పనిచేయకుండా ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చు. అంతేకాకుండా యజమాని ఉద్యోగ ఒప్పంద నిబంధనలు ఉల్లంగిస్తుంటే ఎమిరేట్స్ మానవవనరుల మంత్రిత్వశాఖలో అతని మీద ఫిర్యాదు చేయొచ్చు.
ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 45(1) ప్రకారం, "ఉద్యోగి14 పని దినాలైన పనిచేయకుండానే ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే తన పనికి రాజీనామా చేయడమే కాకుండా జీత బకాయిలు ఇచ్చేయాలి.తన కింద పనిచేసే వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేయడం అంటూ జరిగితే అది కేవలం యజమాని యొక్క వైఫల్యం.అలాగే, చట్టం ప్రకారం యజమాని తన ఉద్యోగితో కుదుర్చుకున్న ఉద్యోగ ఒప్పందం లోని నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన సంబంధించిన మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించవచ్చు".
ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 6(4) ప్రకారం ," తన కింద పనిచేస్తున్న ఉద్యోగుల నుండి వీసా, నియామక మరియు ఇతరత్రా ఖర్చులను యజమాని వసూలు చేయరాదు".
అలాగే చట్టంలో పొందుపరచిన నిబంధనల ప్రకారం, ప్రొబేషన్ లో ఉన్నప్పటికీ మరియు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత జీత బకాయిల చెల్లింపు చేయడానికి నిరాకరిస్తూ మరియు ఇతరత్రా ఖర్చులను మీ నుండి బలవంతంగా వసూలు చేయదానికి ప్రయత్నాలు చేస్తున్న మీ యజమాని పై MOHRE లో ఫిర్యాదు చేయొచ్చు.
MOHRE లో చేసిన మీ ఫిర్యాదు ప్రకారం, మీ యజమాని ని అక్కడికి పిలిపించి హెచ్చరించడమే కాకుండా మీ జీత బకాయిలు ఇప్పించడం మరియు ఉద్యోగ ఒప్పంద పత్రం రద్దు చేయడం జరుగుతుంది.ఇది క్యాబినెట్ రెగ్యులేషన్ 2022 లోని ఆర్టికల్ 16(2) ప్రకారం, "న్యాయ బద్దంగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపు చేయకుండా చట్టంలోని నిబంధనలను అతిక్రమణలు చేస్తూ ఉన్న వారి మీద మంత్రిత్వశాఖ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది".
తాజా వార్తలు
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన







