మధ్యప్రాచ్యంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌదియా ఎయిర్‌లైన్

- June 06, 2022 , by Maagulf
మధ్యప్రాచ్యంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌదియా ఎయిర్‌లైన్

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ (సౌదియా) మధ్యప్రాచ్యంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌లైన్‌గా ర్యాంక్ పొందిందని కంపెనీ తెలిపింది. కింగ్‌డమ్ జాతీయ ఫ్లాగ్ క్యారియర్ 13.1% పెరిగిందని,  బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా 'A' బ్రాండ్ రేటింగ్‌తో రేట్ చేయబడిందని పేర్కొంది. ఈ మేర‌కు బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ ఇటీవల తన వార్షిక నివేదికలో  ప్ర‌చురించిన‌ట్టు  తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ఎయిర్‌లైన్‌లకు ర్యాంక్ ఇచ్చింది. విజన్ 2030లో భాగంగా 2030 నాటికి పర్యాటకుల సంఖ్యను 100 మిలియన్లకు, మతపరమైన సందర్శకుల సంఖ్యను సంవత్సరానికి 30 మిలియన్లకు పెంచాలని రాజ్యం భావిస్తోంది. సౌదియా తన ఫ్లీట్‌లో దాదాపు 150 నారో, వైడ్‌బాడీ ఎయిర్‌బస్, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. అవి 100 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ఆపరేట్ చేస్తున్నాయని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com