తమన్నాకి అనిల్ రావిపూడితో గొడవేంటీ.?
- June 06, 2022
మిల్కీ బ్యూటీ తమన్నాకి, దర్శకుడు అనిల్ రావిపూడికీ మధ్య ఏదో జరిగిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. అందుకు కారణం, రీసెంట్గా రిలీజైన ‘ఎఫ్ 3’ సినిమా ప్రమోషన్లలో తమన్నా ఎక్కడా కనిపించకపోవడమే.
నిజానికి సినిమా ప్రమోషన్లలో మొదట, తమన్నాకాస్త సందడి చేసింది. ఆ తర్వాత తర్వాత పూర్తిగా మాయమైపోయింది. అదే టైమ్‌లో కేన్స్ ఉత్సవాల్లో తమన్నా పాల్గొనాల్సి రావడంతో, ఆ పనిలో బిజీగా వుందిలే అని సరిపెట్టుకున్నారంతా. కానీ, కేన్స్ పండగ ముగిశాకా కూడా ‘ఎఫ్ 3’ ప్రమోషన్లలో తమన్నా హడావిడి కనిపించలేదు.
దాంతో ఆ రగడకు బలం చేకూరింది. అంతేకాదు ఆ టైమ్‌లోనే జరిగిన బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకల్లోనూ మిల్కీ బ్యూటీ తెగ సందడి చేసింది. ఇంత చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా, తన సినిమా కోసం ఎందుకని ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. వీలు కాకుంటే, జస్ట్ ఓ వీడియో బిట్ అయినా రిలీజ్ చేసి వుండొచ్చు నెట్టింటి వేదకగా. కానీ, అది కూడా చేయలేదు తమన్నా.
అందుకు గట్టి కారణం లేకపోలేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడికీ, తమన్నాకి మధ్య షూటింగ్ టైమ్‌లోనే కాస్త కిరికిరి జరిగిందట. అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తి చేయాలని డైరెక్టర్ పెట్టిన తొందరపాటులో భాగంగా, షెడ్యూల్‌కి మించి వర్క్ చేయాల్సి వచ్చేదట. కానీ, తమన్నా అందుకు నిరాకరించేదట. తనకు వర్కవుట్స్ వున్నాయంటూ షెడ్యూల్‌కి హ్యాండిచ్చేదట. అలా కాస్త గ్యాప్ వచ్చిందని తాజాగా అనిల్ రావిపూడి వివరణ ఇచ్చాడు.
అంతేకాదు, ఎవరితోనైనా గ్యాప్ వస్తే, తానే వెళ్లి రిక్వెస్ట్ చేసుకుని, ఆ ఇష్యూని చక్కదిద్దేస్తాను. కానీ, తమన్నా విషయంలో ఆ గ్యాప్ కాస్త పెద్దదైంది అంతే. అయినా అదేమంత పెద్ద ఇష్యూ కాదు. టేక్ లైట్.. అని డైరెక్టర్ కొట్టిపాడేశాడు. ఏది ఏమైతేనేం, ఈ గిల్లికజ్జాల కారణంగానే మిల్కీ బ్యూటీ ‘ఎఫ్ 3’ ప్రమోషన్లకు దూరంగా వుందన్న మాట.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







