2026 నాటికి భారత్ లో తొలి బుల్లెట్ రైలు
- June 07, 2022
            భారత్‌లో బుల్లెట్ రైలు పరుగుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును 2026 నాటికి నడపాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పనులు చాలా వరకు పూర్తి చేసినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సూరత్‌లోని వక్తానా గ్రామ సమీపంలో ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ సెక్షనల్ కాస్టింగ్ యార్డ్ ఆపరేషన్‌ను ఆయన పరిశీలించారు. దీంతోపాటు ప్రాజెక్టు కింద నిర్మాణంలో ఉన్న అంటోలి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.
ఆ తర్వాత రైల్వేశాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్‌తో కలిసి నవ్‌సారిలోని నసిల్పూర్కు వెళ్లి.. అక్కడ ప్రాజెక్ట్ స్థలాన్ని సైతం పరిశీలించారు. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం 61 కిలోమీటర్ల మార్గంలో పిల్లర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దాదాపు 150 కిలోమీటర్ల మార్గంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు.
మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని, ఈ లైనులో 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు.ఇందులో ఎనిమిది గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు. రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త వందేభారత్ రైళ్లు, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ, బుల్లెట్ రైళ్లు, అల్ట్రా మోడ్రన్, అత్యుత్తమ సేవలు అందించడమే ప్రధాని లక్ష్యమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







