ఉచితంగా పాఠశాల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

- June 07, 2022 , by Maagulf
ఉచితంగా పాఠశాల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

యూఏఈ: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబిలిష్ మెంట్(ESE) ప్రకారం, ఉచితంగా పాఠశాల విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే యూఏఈ మరియు అర్హులైన ప్రవాసి విద్యార్థులు తమ నివాసం దగ్గరలోని Ajyal అనే మోడల్ పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలి. 

ESE ప్రకారం,ఈ నూతన మోడల్ పాఠశాలల్లో సిలబస్ , స్కూల్ టైమింగ్స్ మరియు ఇతరత్రా వన్ని యధావిధిగా ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ఉంటాయి.అలాగే, తమ పిల్లల చదువుకోవడం కోసం పాఠశాలను ఎంచుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది.  

అలాగే, ఈ పాఠశాలల్లో చదువుకోవడం కోసం అదనపు ఫీజులు చెలించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే వాటిని పూర్తిగా భరిస్తుంది.ESE పర్యవేక్షణలో ప్రస్తుతం ఈ 10 నూతన మోడల్ పాఠశాలల్లో 1 - 4 గ్రేడ్ తరగతులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.2024 నాటికి 5, 6 గ్రేడ్స్ లకు ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి పర్యాయం దరఖాస్తులు తిరస్కరించిన వారికి మరో దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. 

ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి నష్టం వాటిళ్లకుండా యూఏఈ విద్యావిధానం ప్రకారం శాస్త్రీయ పద్దతిలో విద్యా పద్దతులను ప్రవేశపెట్టడం జరిగిందని ESE పేర్కొంది.

ఈ నూతన విద్యా విధానాన్ని ప్రయివేటు రంగం భాగస్వామ్యంతో 2022-23 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com