సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు: సీపీ

- June 07, 2022 , by Maagulf
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు: సీపీ

హైదరాబాద్: సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర పోలీసు అధికారులను ఆదేశించారు. 

ఈరోజు సైబరాబాద్‌లోని పోలీస్ కమీషనరేట్‌లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే  వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. కమీషనరేట్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారిని సత్ప్రవర్తనతో మెలుగుటకు మరియు ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండుటకై సైబరాబాద్ పోలీస్ కమీషనర్  స్టీఫెన్ రవీంద్ర కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ అధికారాలను వినియోగించి ఈ క్రింది వారిపై విచారణ జరిపి ఆ వ్యక్తులు సత్ప్రవర్తనతో మెలుగుట కొరకు హామీ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులను జారీ చేయడమైనది. 

ఈ ఉత్తర్వుల ప్రకారం ఇద్దరు జమీనుదారులతో 50 వేల రూపాయల హామీ బాండ్ ఇచ్చుటకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 107/122 CrPC ప్రకారం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనట్లయితే ఒక సంవత్సర కాలం జైలుకు పంపబడుదురు. 

వ్యక్తుల వివరములు: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ రషీద్, మహమ్మద్ గతంలో ఒక హత్యకేసులో రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో ప్రజలకు శాంతి భద్రతలకు భంగం కలిగించారు. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో రాంలాల్ శంకర్ లాల్ పరదేశి, మరియు మొహమ్మద్ షాబాజ్ ఖాన్లు కుల్సుంపుర మరియు పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో ఉండి ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. అలాగే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ గౌస్, జగద్గిరిగుట్ట స్టేషన్ పరిధిలో అలిగా నరేష్, శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో  నక్క నరేష్ మొదలగు వీరందరిపై శాంతి మరియు సత్ప్రవర్తనతో ఒక సంవత్సర కాలం నిలుపుట కొరకు ప్రతి వ్యక్తికి 50 వేల రూపాయల హామీ బాండ్ తీసుకోవడం జరిగినది. ఈ సంవత్సర కాలం పాటు ఇలాంటి ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని ఉత్తర్వులు జారీ చేయడమైనది.

ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్ ఏ‌సీపీ రవిచంద్ర, ఇన్ స్పెక్టర్లు, తదితరులు   పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com