హమ్మయ్యా.! నయన తార పెళ్లి నిజమే.!
- June 07, 2022
ఎట్టకేలకు నయన తార పెళ్లి చేసుకోబోతోంది. ప్రభుదేవా, శింబులతో ప్రేమాయణం బెడిసికొట్టేసరికి నయన తారకు పెళ్లి మీద ఎక్కడ లేని విరక్తి పుట్టినట్లుంది. దాంతో పెళ్లి ఊసెత్తాలంటేనే భయపడిపోయినట్లుంది. పెళ్లి, గిళ్లీ లేదు.. హాయిగా లివింగ్ రిలేషన్‌ని ఎంజాయ్ చేసింది.
అదేనండీ.! తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయన తార గత కొంతకాలంగా ప్రేమలో వున్న సంగతి తెలిసిందే కదా. లివింగ్ రిలేషన్ షిప్ పేరు చెప్పి, ఆయనతో పూజలు, వ్రతాలూ, అన్ని రకాల శుభ కార్యాలతో పాటు, బర్త్‌డేలూ గట్రా ఎంజాయ్ చేస్తోంది.
ఆ ఫోటోలూ, వీడియోలకూ నెట్టింట్లో ఫుల్ డిమాండ్.. అన్నముచ్చటా అందరికీ ఎరుకే. అయితే, ఎండ్ ఆఫ్ ది డే, నయన్ పెళ్లికి ఒప్పేసుకుంది. ఇంకేముంది, విఘ్నేష్ శివన్ వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశాడు. జూన్ 9న ఈ జంట పెళ్లి ముడితో ఒక్కటి కానున్నారు.
తిరుమలలో విఘ్నేష్ శివన్, నయన తార పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ, అనివార్య కారణాల వల్ల అది కుదరలేదట. దాంతో మహాబలిపురానికి పెళ్లి వేదిక మార్చబడింది. అక్కడే అతి కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య నయన్, విఘ్నేష్ వివాహం ఘనంగా జరగనుందట.
ఈ వేడుకనంతటినీ షూట్ చేసేందుకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఓ పెద్ద స్కెచ్ ప్లాన్ చేశాడట. పెళ్లి వీడియోని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నారట. అయితే, జూన్ 9, మధ్యాహ్నం పెళ్లి ఫోటోలను మేమే అధికారికంగా రిలీజ్ చేస్తామనీ, జూన్ 11న మీడియా ముందుకు జంటగా రాబోతున్నాం.. అంటూ విఘ్నేష్ శివన్ స్వయంగా తెలపడంతో ఈ న్యూస్‌పై పక్కాగా క్లారిటీ వచ్చింది.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







