లేబర్ మార్కెట్ వృద్ధికి బహ్రెయిన్ చర్యలు

- June 08, 2022 , by Maagulf
లేబర్ మార్కెట్ వృద్ధికి బహ్రెయిన్ చర్యలు

మనామా: భద్రతతో కూడిన పని వాతావరణం కల్పించేందుకు, కార్మికుల హక్కుల్ని పరిరక్షించేందుకు బహ్రెయిన్ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాల్ని అమలు చేస్తూ వస్తోంది. ఈ విషయాన్ని లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ మరియు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ జమీల్ బిన్ మొహమ్మద్ అల్ హుమైదాన్ వెల్లడించారు. 110వ సెషన్ అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ (జెనీవా)లో ప్రసంగం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించామనీ, ఆ తర్వాత లేబర్ మార్కెట్‌లో వృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామనీ చెప్పారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తూ, పని వాతావరణాన్ని మెరుగు పరుస్తున్నామని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com