'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ విడుదల
- June 08, 2022హైదరాబాద్: పక్కా కమర్షియల్ మేకర్స్ ఈరోజు ట్రైలర్ గ్లింప్స్‌ని ఆవిష్కరించారు. ఈ ముప్పై సెకన్ల వీడియో క్లిప్‌లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్ మరియు సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్ లో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా కనిపించనుంది.
హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 12న ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినీ నిర్మాతలు కర్నూల్‌లో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.
మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 1న రిలీజ్ కానుంది.
ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు అన్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







