‘రిపబ్లిక్’ ఛాయలున్నాయ్.. నెట్టుకు రావడం కూసింత కష్టమే బాస్.!
- June 09, 2022
వెర్సటైల్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ సే’. లేటెస్టుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ట్రైలర్ చూస్తుంటే, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమాని తలపిస్తోంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సీరియస్ టోన్‌లో రూపొందిన చిత్రంగా అనిపిస్తోంది.ట్రైలర్‌లో ప్రస్తుతం పొలిటికల్ వ్యవస్థలో నెలకొన్నతీరు తెన్నులను ఎండగట్టేసినట్లు అనిపిస్తోంది.పవర్ ఫుల్ డైలాగులతో నింపేశారు ట్రైలర్ మొత్తాన్ని.
సత్యదేవ్ మంచి నటుడు. ఆయన బాడీ టోన్‌కి ‘గాడ్ సే’ సబ్జెక్ట్ చక్కగా సూటయ్యింది. కానీ, కంటెంట్ పరంగా చూస్తే, ఈ తరహా కంటెంట్‌ని ప్రేక్షకులు అంగీకరించడం లేదు. కంటెంట్‌లో నిజాయితీ వున్నప్పటికీ, ఒప్పుకునేందుకు ఇష్టపడడం లేదు.
అలాగే, మొన్న వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమా చచ్చిపోయింది. ఇలాంటి కంటెంట్లను కేవలం సినిమాలుగా చూడనే చూడకూడదు. కానీ, సక్సెస్ యాంగిల్‌లో మాత్రం ఈ సినిమాని గుర్తించలేం. ఇక ట్రైలర్‌లో ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగుంటాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారు..’ ఇలాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయ్.
ప్రస్తుతం ‘గాడ్ సే’ ట్రైలర్ అయితే, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. కానీ, ధియేటర్లో సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనేది చెప్పలేం. ఈ నెల 17న ‘గాడ్ సే’ ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీ గణేష్ పట్టాభి ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!