నయన తార పెళ్లికి మహానుభావులెందరో ఆహ్వానితులు
- June 09, 2022
సౌత్ క్వీన్‌గా పిలవబడే నయన తార ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గత కొంత కాలంగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ అండ్ డేటింగ్‌లో బిజీగా వున్న నయనతార జూన్ 9 గురువారం వివాహం చేసుకుని ఓ ఇంటిది అయ్యింది.
ఇంతకాలం పెళ్లంటే భయపడిన నయన తార ఎట్టకేలకు ఆ భయాలన్నింటినీ వీడి ఘనంగా విఘ్నేష్ శివన్‌ని వివాహ మాడింది.వీరి పెళ్లికి మహాబలిపురం వేదిక అయ్యింది. చాలా తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలోనే వీరి వివాహం జరుగుతుందని అన్నారు.
కానీ, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ సహా, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, దిలీప్ కుమార్ కూడా ఈ వివాహానికి అతిథులుగా హాజరయ్యారు. అలాగే కోలీవుడ్ అగ్ర నటులు రజనీకాంత్ మొదలుకొని, సూర్య, కార్తి, అజిత్, విజయ్ సేతుపతి, రాధికా శరత్ కుమార్ దంపతులు, అలాగే, దర్శకులు అట్లీ, మణిరత్నం తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
నయన తార క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. అయితే, గతంలోనే హిందూ మతంలోనికి కన్వర్ట్ అయ్యింది. హిందూ సాంప్రదాయం ప్రకారమే నయన తార వివాహం జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా మంగళ సూత్రం అందుకున్నాడు విఘ్నేష్ శివన్.
‘10లో తొమ్మిది ఆమె, అందులో ఒకటి నేను.. దేవుడు, విశ్వం, మీ అందరి ఆశీస్సులతో నేను ఆమెను వివాహం చేసుకున్నాను..’ అంటూ ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ ఎమోషన్ అయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







