NBK 107: సింహం మొదటి హంట్ మొదలెట్టేసింది
- June 09, 2022
బాలయ్య 107వ చిత్రంగా తెరకెక్కుతోన్న మూవీకి సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టైటిల్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ, టైటిల్ రిలీజ్ చేయలేదు. కానీ, టీజర్ మాత్రం బాలయ్య మాస్ అప్పియరెన్స్‌కి తగ్గట్టుగా వుంది.
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. హీరో ఎలివేషన్ సీన్లు బాలయ్య సినిమాల్లో ఎలా వుంటాయో అలాగే వున్నాయ్. ఓ యాక్షన్ బిట్ కట్ చేశారు. జనాల చేత దండాలు పెట్టించుకోవడం.. అఖండ కత్తి.. లుంగీ ఎగ్గట్టి, రౌడీల్ని ఎగరగొట్టి తన్నడాలు.. ఇవన్నీ బాలయ్య సినిమాల్లో సహజంగా వుండే యాక్షన్ ఎలివేషన్సే.
వాటినే ఈ టీజర్లోనూ హైలైట్ చేశారు. ఇక డైలాగుల విషయానికి వచ్చేద్దాం. మాస్ డైలాగులు పేల్చడంలో బాలయ్య ది కింగ్. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా డైలాగులు చొప్పించారు. ‘బోసు డీకే, నా కొడకల్లారా..’ లాంటివి.
‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అయితే, నా జీవో గాడ్స్ ఆర్డర్..’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఎప్పటిలాగే ‘భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే..’ అంటూ మాస్ బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్ డైలాగ్ ఒకటి మధ్యలో. ‘నరకడం మొదలెడితే, ఏ పార్ట్ ఏంటో మీ పెళ్లాలకి కూడా తెలీదురా నా కొడకల్లారా..’ అంటూ టీజర్ ఎండ్ చేశారు.
బాలయ్య అభిమానులయితే, ఈ టీజర్‌కి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అయితే, టైటిల్ ఇంకా రిలీజ్ చేయకపోవడంపై కాస్త నిరాశ పడుతున్నారు అభిమానులు. టీజర్లో హీరోయిన్ (శృతిహాసన్)కి గానీ, మరే ఇతర నటీ నటులెవ్వరికీ చోటు దక్కలేదు. సింహం సింగిల్‌గా వచ్చేసింది. కత్తి పట్టి నరుక్కుంటూ పోయింది. అదీ సంగతి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







