‘గుర్తుందా శీతాకాలం’ : మ్యాజికల్ లవ్ జర్నీలో మిల్కీ బ్యూటీ

- June 09, 2022 , by Maagulf
‘గుర్తుందా శీతాకాలం’ : మ్యాజికల్ లవ్ జర్నీలో మిల్కీ బ్యూటీ

ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఎఫ్ 3’ సినిమాతో సందడి చేసింది. ఓ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, తమన్నా కెరీర్ అయిపోయిందనుకున్న టైమ్‌లో ‘ఎఫ్ 3’తో బంపర్ హిట్ కొట్టి, మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది.

ఓ వైపు ‘ఎఫ్ 3’ సందడి, మరోవైపు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ హంగామా.. ఇలా చెప్పుకుంటూ పోతే, తమన్నా అస్సలు ఖాళీగా లేనే లేదు ఈ మధ్యకాలంలో. ఈ టైమ్‌లోనే ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ ఓ డిఫరెంట్ మూవీలో నటించింది తమన్నా.

అసలేంటీ ‘గుర్తుందా శీతాకాలం’. ఇదో మ్యాజికల్ లవ్ జర్నీ అట. తమన్నాతో విలక్షణ నటుడు సత్యదేవ్ జత కడుతున్నాడు ఈ సినిమాలో. అదేంటీ. తమన్నా, సత్యదేవ్‌తో జోడీ కట్టడమేంటీ.? అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.

అదే మ్యాజిక్ మరి. కంటెంట్ చాలా డిఫరెంట్‌గా వుండబోతోందట. సత్యదేవ్ నటిస్తున్నాడంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’ అని గుర్తుందచుకోవల్సిందే. ఇక, వీరిద్దరి మధ్యా లవ్ ట్రాక్ అంటే అదేదో ఖచ్చితంగా విలక్షణ‌మైన చిత్రమే.

పోస్టర్లూ, ప్రోమోలతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. కానీ, కథా, కమామిషు.. ఇలాంటి అంశాలపై కాస్త గోప్యం వహిస్తున్నారు. పోస్టర్ల విషయానికి వస్తే, కంప్లీట్ రొమాంటిక్ అప్పీల్ ఇస్తున్నాయి. వచ్చే నెల 17న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గుర్తుంచుకోండి గైస్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com