జీసీసీ నివాసితులకు కొత్త వీసా విధానం: సౌదీ అరేబియా
- June 10, 2022
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) నివాసితుల కోసం సౌదీ అరేబియా త్వరలో కొత్త వీసా పథకాన్ని ప్రవేశపెడుతుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. 2019లో కింగ్‌డమ్ ప్రారంభించిన పర్యాటక వీసాలు ఇప్పటికీ ఉన్నాయని, పర్యాటకం కోసం వచ్చే వారికి నిర్దిష్ట పరిమితులు లేవని అల్-ఖతీబ్ చెప్పారు. 2021లో రాజ్యంలో 64 మిలియన్ల దేశీయ పర్యటనలు జరిగాయని, అయితే విదేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య గత సంవత్సరం 5 మిలియన్లకు చేరుకుందన్నారు. మహమ్మారి సమయంలో పర్యాటకుల శాతం 40 శాతం తగ్గిందన్నారు. దిరియా ప్రాజెక్ట్ లోని అల్-బుజైరి ప్రాంతాన్ని ఈ సంవత్సరం తెరవనున్నట్లు అల్-ఖతీబ్ తెలిపారు. 2019లో ఉద్యోగాల కల్పనలో పర్యాటక రంగం సహకారం 3 శాతంగా ఉందని, 2030 నాటికి 10 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సౌదీలో ఉద్యోగ రంగం 2019 నుండి ఇప్పటి వరకు 15 శాతం పెరిగి 820,000 ఉద్యోగాలకు చేరుకుందన్నారు. అలాగే 2019లో జీడీపీలో 3 శాతంగా ఉన్న పర్యాటక రంగ ఆదాయాన్ని.. 2030 నాటికి 10 శాతానికి చేర్చే లక్ష్యంతో ముందుకుపోతున్నట్లు అల్-ఖతీబ్ పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి $200 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







