జూలై 1 నుంచి మారుతున్న కొత్త లేబర్ చట్టాలు ఇవే..!

- June 10, 2022 , by Maagulf
జూలై 1 నుంచి మారుతున్న కొత్త లేబర్ చట్టాలు ఇవే..!

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే..ఇప్పుడు మరో కొత్త చట్టాన్ని అమల్లొకి తీసుకొని రానుంది.పాత లేబర్ చట్టాల స్థానంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కార్మిక చట్టాలను తేవాలని ఆలోచిస్తుంది.

కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కార్యాలయ పని వేళలు, జీతం, ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వంటి వాటిలో చాలా మార్పులు వస్తాయి. కొత్త సంస్కరణల ద్వారా లేబర్ కోడ్‌ వేతనాలు, సామాజిక భద్రత (పెన్షన్, గ్రాట్యుటీ), కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కొత్త చట్టాలు జూలై 1 నుంచి వచ్చే అవకాశం ఉందని సమాచారం..

కొత్త కార్మిక చట్టంలోని అంశాలు..

1. కార్యాలయ పని వేళల్లో పూర్తిగా మారిపోతాయి.8-9 గంటల నుంచి 12 గంటలకు పెంచవచ్చు. ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఉండే అవకాశం ఉంది.

2. పరిశ్రమల్లో కార్మికులకు గరిష్ట ఓవర్‌టైమ్ 50 గంటల నుండి 125 గంటలకు పెరుగుతుంది.

3. ప్రాథమిక వేతనాన్ని స్థూల జీతంలో 50%గా ఉండవచ్చు. జీతాల పెరుగుదలలో మార్పులు వస్తాయి.

4. ఉద్యోగుల PF ఖాతాల్లో నగదు భారీగా పెరుగుతుంది.

5. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరగడం వలన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారని ప్రభుత్వం యోచిస్తుంది.

6. సెలవుల అర్హత సంవత్సరంలో 240 రోజుల నుంచి 180 రోజులకు తగ్గుతుంది. అంటే ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు ఉంటుంది..

ఈ కొత్త చట్టాల వలన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ కోడ్ ను అమల్లొకి తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com