ఢిల్లీ జామా మసీదు ఎదుట భారీ నిరసన..
- June 10, 2022
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలోని జామా మసీదు వద్ద వందలాది మంది ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా అనేక మంది నిరసన బాట పట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామంపై స్పందించిన మసీదు కమిటీ.. తాము ఎలాంటి ఆందోళనలకు పిలుపు ఇవ్వలేదని తెలిపింది. వీరంతా మజ్లిస్ పార్టీ చెందిన కార్యకర్తలుగా భావిస్తున్నామని తెలిపింది. ఈ ఆందోళన కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మసీద్ కమిటీ పేర్కొంది. అప్రమత్తమైన పోలీసులు మసీదు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
కాగా, నిరసన ప్రదర్శనకు మసీదు కమిటీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహి ఇమామ్ తెలిపారు. మసీదు ముందు నిరసన ప్రదర్శన చేపట్టినవారు ఎవరో తమకు తెలియదన్నారు. శుక్రవారం ప్రదర్శన చేపట్టాలని కొందరు గురువారం ప్లాన్ చేశారని, కానీ వాళ్లు మసీదు అనుమతి ఇవ్వలేదని షాహి ఇమామ్ తెలిపారు. ఆందోళన చేపట్టినవాళ్లు బహుశా ఎంఐఎం పార్టీ లేదా ఓవైసీ మద్దతుదారులై ఉంటారని ఆయన అన్నారు. నిరసన చేపడుతున్నవారికి తాము మద్దతు ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేవారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







