మహజూజ్ వీక్లీ ర్యాఫిల్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు..
- June 11, 2022
దుబాయ్: మహజూజ్ వీక్లీ ర్యాఫిల్ డ్రాలో భారత ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది.తాజాగా నిర్వహించిన మహజూజ్ వీక్లీ ర్యాఫిల్ డ్రాలో దుబాయ్‌లో ఉండే భారత్‌కు చెందిన మహమ్మద్ ఏకంగా 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.ఆరేళ్లుగా యూఏఈలో ఉంటున్న కేరళ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహమ్మద్ దుబాయ్‌లో మరో వ్యక్తితో కలిసి చిన్న పెర్ఫ్యూమ్ షాపు నిర్వహిస్తున్నాడు.ఇటీవల ఆన్‌లైన్ ద్వారా 35 దిర్హాములు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనడం ద్వారా మహజూజ్ ర్యాఫిల్ లో ఎంటర్ అయినట్లు తెలిపాడు. అలా 35 దిర్హాములతో కొన్న వాటర్ బాటిల్‌తో డ్రాలో పాల్గొనేందుకు ఓ లైఫ్‌లైన్ లభిస్తుందట.ఇక తాజాగా నిర్వహించిన వీక్లీ డ్రాలో మహమ్మద్‌కు అదృష్టం వరించింది.అంతే.. విజేతగా నిలిచి 1లక్ష దిర్హాములు సొంతం చేసుకున్నాడు.
లైవ్ డ్రా సమయంలో పనిమీద బయటకెళ్లిన అతడు..ఇంటికి వచ్చి మెయిల్ చెక్ చేసుకోగా లాటరీ నిర్వాహకుల నుంచి తాను 1లక్ష దిర్హాములు గెలిచినట్లు సందేశం ఉంది.దాంతో వెంటనే తన మహజూజ్ ఖాతాను ఓపెన్ చేసి చూస్తే నిజంగానే డ్రాలో విజేతగా నిలిచినట్లు నిర్ధారించుకున్నాడు.అనంతరం ఈ విషయాన్ని స్వదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.ఇక తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వినియోగించనున్నట్లు చెప్పాడు.మహమ్మద్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఇప్పుడు లాటరీ రూపంలో తన చేతికి భారీ మొత్తం రావడంతో పెళ్లి చాలా ఘనంగా చేసుకుంటానని మురిసిపోతున్నాడు.అలాగే తన తల్లికి చాలా కాలంగా ఓ ఖరీదైన గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉందని చెప్పిన మహమ్మద్..ఇవాళ అది నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







