ఫిఫా వరల్డ్ కప్.. హోస్ట్ చేయడానికి నమోదు తప్పనిసరి
- June 11, 2022
ఖతార్: ఫిఫా(FIFA) వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం మ్యాచ్ టిక్కెట్లు, హయ్యా డిజిటల్ కార్డ్ ని ఆమోదించిన స్నేహితులు, కుటుంబాలను హోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నివాసితులు ప్రత్యామ్నాయ వసతి ట్యాబ్ ద్వారా హయ్యా పోర్టల్‌లో తమ ఆస్తిని నమోదు చేసుకోవాలని అధికార వర్గాలు తెలిపాయి. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 జరగనున్న విషయం తెలిసింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు దోహాకు చేరుకుంటారు. ఎనిమిది స్టేడియంలలో జరిగే ఈ ఈవెంట్లో వేలాది మంది అభిమానులు ఖతార్‌లో కుటుంబం, స్నేహితులతో కలిసి ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. టోర్నమెంట్ కోసం ఖతార్‌కు వెళ్లే ప్రతి అభిమాని హయ్యా డిజిటల్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖతార్‌కు ప్రవేశ అనుమతిగా పని చేస్తుంది. ఇది మ్యాచ్ రోజులలో ఉచిత ప్రజా రవాణాతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మ్యాచ్‌లకు హాజరు కావాలనుకునే ఖతార్ నివాసితులు కూడా హయ్యా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. టిక్కెట్టు పొందిన కుటుంబం, స్నేహితులను హోస్ట్ చేయాలనుకునే స్థానిక నివాసితులు.. మ్యాచ్‌లకు హాజరుకానివారు హయ్యా కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. అలాగే టోర్నమెంట్ సమయంలో ఖతార్లోకి ప్రవేశించాలనుకునే ఖతార్ పౌరులు/నివాసులు హయ్యా కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?