పోలీసుల చేతిలో ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్‌

- June 11, 2022 , by Maagulf
పోలీసుల చేతిలో ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్‌

హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల హైదరాబాద్‌లో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.అయితే ఆమెకు ఆత్మహత్యకు చెందిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది.

అందులో ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా వెల్లడించారు. తాను స్వేచ్ఛను కోరుకున్నానని అందులో ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను ఎవరికీ భారం కాదల్చుకోలేదని కూడా ఆమె తెలిపారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అనేక సార్లు యత్నించినట్లు చెప్పిన ప్రత్యూష. ప్రతి రోజు తాను బాధపడుతూనే ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే…శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది. మరోవైపు మహిళా సెలబ్రిటీలకు డిజైనింగ్‌లో ప్రత్యూష సిద్ధహస్తురాలని తెలుస్తోంది. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పాటు పలువురు క్రీడాకారులకు కూడా ఆమె డిజైనింగ్ చేశారు.ఈ క్ర‌మంలో అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఆత్మ‌హ‌త్యకు సంబంధించి ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. కార్బ‌న్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేర‌కు ఆమె గ‌దిలో కార్బ‌న్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు క‌నుగొన్నారు. త‌న ఇంట్లోని బాత్ రూమ్‌లో ప్ర‌త్యూష విగ‌త జీవిగా ప‌డి ఉన్న విష‌యాన్ని గుర్తించిన ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ప్రాథ‌మిక ఆధారాలు సేక‌రించి ప్ర‌త్యూష మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com