నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ రిస్క్ పై ఖతార్ సర్వే

- June 12, 2022 , by Maagulf
నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ రిస్క్ పై ఖతార్ సర్వే

దోహా: దీర్ఘకాలిక నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సిడిలు) రిస్క్ కోసం రెండవ జాతీయ స్టెప్‌వైజ్ సర్వేను నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ మంత్రి డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారీ, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ హెడ్  డాక్టర్ సలేహ్ బిన్ మహ్మద్ అల్-నాబెట్ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. 8000 ఖతారీ, నాన్-ఖతారీ కుటుంబాలపై ఈ సర్వేను నిర్వహించనున్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయాలని వారు నిర్ణయించారు. ఉత్తమ సర్వే పద్ధతులను అధ్యయనం చేయడానికి, పురోగతి నివేదికలను సిద్ధం చేయడానికి, సవాళ్లను గుర్తించడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నిర్వహించిన 2012 సర్వేకి అనుబంధంగా ఈ సర్వేని నిర్వహించనున్నారు. పొగాకు వాడకం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్య పోషణ, ఊబకాయం, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ పెరగడం, రక్తంలో కొవ్వు పెరగడం వంటి ప్రమాద కారకాల నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య వ్యూహం 2030 కింద కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయనున్నట్లు డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com