డీ హైడ్రేషన్ ని నివారించే చిట్కాలు...
- June 12, 2022
వాతావరణంలో వేడి అనేక అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది.ముఖ్యంగా వేసవి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏవో సమస్యలతో బాధపడుతూనే ఉంటారు.ఎండాకాలంలో అధిక శాతం మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారు.శరీరంలోని నీరంతా కోల్పోయి నీరసపడిపోతుంటారు.డీహైడ్రేషన్ నుండి తప్పించుకోనేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
డీ హైడ్రేషన్ లక్షణాలు ; కడుపునొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. గంట వ్యవధిలో రెండు , మూడు సార్లు నీళ్ల విరోచనాలు అవుతాయి. కొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కడుపునొప్పి, విరోచనాలకు తోడుగా వాంతులు కూడా అవుతాయి.ఏమి తిన్నా, నీళ్లు తాగినా వెంటనే విరోచనం అవుతుంది. శరీరంలోని లవణాలు, సూక్ష్మపోషకాలు నష్టపోవాల్సి వస్తుంది. నోటిలో , నాలుక మీద తేమ తగ్గి పొడిగా మారుతుంది.నీరం ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోతారు.
డీ హైడ్రేషన్ జాగ్రత్తలు ; వాంతులు, విరోచనాలు అవుతున్నప్పుడు ఈ సమస్య వస్తుంది.దీనిని నివారణకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ద్రవాన్ని ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో కోల్పోతున్న లవణాలను , సూక్ష్మపోషకాలను ఓఆర్ఎస్ ద్రవం భర్తీ చేస్తుంది.సగ్గు బియ్యం, బార్లీ చేరిన గంజి, మజ్జిగ, కొబ్బరి బోండం నీరు ఎక్కువగా తీసుకోవాలి.
తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రాగి మాల్ట్, కిచిడి వంటివి తీసుకోవాలి.వాంతులు, విరేచనాలు ప్రారంభం కాగానే చాలా మంది ఆహారం మానేస్తుంటారు.ఇది ఏమాత్రం సరికాదు.కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.ఘన పదార్ధాలు కాకుండా ద్రవ పదార్ధాలు ఎక్కువగా ఇవ్వాలి. ఎండ వేడి వల్ల వచ్చే విరేచనాలు, వాంతులతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.తాగే నీరు కలుషితం అయినా విరోచనాలు, వాంతులు అవుతాయి. ఎండ వేడి భరించలేక చాలా మంది శీతలపానీయాలు తీసుకుంటారు.ఇది ఏమాత్రం సరైంది కాదు. నీళ్ల విరేచనాలతో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







