యూపీలో 304 మంది నిందితుల అరెస్టు
- June 12, 2022
లక్నౌ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై ఆ పార్టీ చర్యలు తీసుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో హింస చెలరేగింది. దీంతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 304 మంది నిందితులను అరెస్టు చేశామని ఏడీజీ (శాంతి, భద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు. ప్రయాగ్ రాజ్‌లో 91, సహారన్ పూర్లో 71, హాథ్రస్లో 51, మోరాదాబాద్‌లో 34, ఫెరోజాబాద్లో 15, అంబేద్కర్ నగర్లో 34 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. మొత్తం 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. శుక్రవారం మసీదుల్లో ప్రార్థన తర్వాత వారంతా ఆందోళనల్లో పాల్గొన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. కాగా, ఆయా ప్రాంతాల్లో మరోసారి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!







