ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
- June 12, 2022
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. జూన్ 02 న ఆమె కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి కరోనా తో బాధపడుతూ ఐసోలేషన్ లో ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అయితే, కరోనా సంబంధిత సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
“కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం స్థిరగా ఉంది. వైద్యుల పరిశీలన కోసం ఆస్పత్రిలో చేరారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.” అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ ద్వారా తెలియజేశారు.
జూన్ రెండో తేదీన సోనియాకు కరోనా వైరస్ సోకింది. దీంతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ని గడువు కోరారు. ఈ మేరకు జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆమె కుమారుడు, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా జూన్ 13న ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపించింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జూన్ 13న హాజరు కావాలని ఫెడరల్ ఏజెన్సీ రాహుల్ గాంధీని కోరింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







