తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- June 13, 2022
హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మహబూబ్నగర్ జిల్లా వరకు ఈ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.సోమవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా… రాష్ట్రంలో మంగళ, బుధ చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశమున్నట్లు తెలిపింది. అదే విధంగా గంటకు 30నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాగల 48గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలు తదుపరి రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







