ఆర్జీవీ మళ్లీ మొదలెట్టాడు. ఈ సారేం జరుగుతుందో.!
- June 13, 2022
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మళ్లీ పబ్లిసిటీ స్టంట్ స్టార్ట్ చేశాడు. ఈ సారి దేనికోసం అంటారా.? ఆ మధ్య ‘కొండా’ అనే టైటిల్ అనౌన్స్ చేసి, తన కొత్త సినిమా ముచ్చట గురించి వర్మగారు విన్నవించిన సంగతి తెలిసిందే. అదేనండీ కొండా సురేఖ భర్త కొండా మురళి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఎప్పుడు తీశాడో ఏమో తెలీదు. కానీ, ఈ సినిమా పూర్తయిపోయిందట. రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు వర్మ. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ వున్న కొండా మురళి జీవితంలోని జనాలకు తెలియని కొన్ని కొత్త కోణాలను బయటికి తీయడమే ఈ సినిమా ఉద్దేశ్యం. దాన్ని క్యాష్ చేసుకోవడం వర్మ వుద్దేశ్యం.
అయితే, ఈ మధ్య వర్మ సినిమాలు ఏ రకమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘డేంజరస్’ అనే అడల్ట్ కంటెంట్ సినిమా తీసి, పబ్లిసిటీ కోసం దేశాలు కూడా తిరిగేసి, తీరా సినిమా రిలీజ్ టైమ్ వచ్చేసరికి అబాసు పాలైన సంగతి తెలిసిందే.
నిజానికి ఆయన సినిమాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా రావడం లేదు. కానీ, ఆయన తాపత్రయం మాత్రం మారదు. ఇక, ‘కొండా’ సినిమా విషయానికి వచ్చేసరికి కొండా మురళి భార్య కొండా సురేఖ, గతంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆవిడే ఈ సినిమాకి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటోంది. ఖర్చు మొత్తం ఆవిడదే. రాజకీయాల్లో హైలైట్ అయ్యేందుకే ఈ ప్రయత్నం అంతా చేస్తోంది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందే ఈ సినిమా అయినా రిలీజ్ అవుతుందా.?
ఒకవేళ రిలీజ్ అయినా, పబ్లిసిటీ ఖర్చులు అయినా దక్కించుకుంటుందా.? ఏమో. అయినా ఆయనకు రూపాయ్ ఖర్చు లేని యవ్వారం. ఇంకేం, దర్జాగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు వర్మగారు. అన్నట్లు ఈ సినిమాలో కొండా సురేఖ పాత్రను కూడా హైలైట్ చేయబోతున్నాడు వర్మ. ఆ పాత్రలో ఇర్రా మోర్ హీరోయిన్గా నటిస్తోంది.
KONDA family moolaana idhee naa paristhithi 😳😳😳 pic.twitter.com/rqN9a18nWc
— Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2022
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







