రీ ఎంట్రీ కోసమేనా ఆ సీనియర్ హీరోయిన్ ఫీట్లు.!
- June 13, 2022
‘స్వయంవరం’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ లయ గుర్తుంది కదా. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన బ్యూటీ ఈ ముద్దుగుమ్మ. పదహారణాల తెలుగందం. ట్రెడిషన్‌తో పాటు, హద్దులు దాటని గ్లామర్ లుక్స్‌తోనూ కట్టిపడేసింది అప్పట్లో లయ.
‘హనుమాన్ జంక్షన్’, ‘ప్రేమించు’ తదితర సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంది. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో వున్నసమయంలోనే ఫారెన్ బిజినెస్ మ్యాన్ని పెళ్లాడి, అమెరికాలో సెటిలైపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా లయలో అందం ఇసుమంతైనా తగ్గలేదు. పిల్లలు పెద్దగా అయినా, లయ అంద చందాలకు ఏమాత్రం లోటు రాలేదు.
మొన్నా మధ్య మాస్ రాజా రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కూతురుతో కలిసి లయ మెరుపుతీగలా మెరిసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిన్న బిట్లో కనిపించి మెప్పించింది లయ. ఆ తర్వాత నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతుందనుకున్నారంతా. కానీ, పెద్దగా కనిపించలేదు.
కానీ, లయకు నటనపై మోజు తగ్గలేదనీ, మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోందనీ తెలుస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో లయ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మంచి నటనే కాదు, డాన్స్ టాలెంట్ కూడా మెండుగా వుంది లయకు. ఆ టాలెంట్‌తోనే సోషల్ మీడియాని కుదిపేస్తోంది.
కొన్నిసార్లు ఫ్రెండ్స్‌తో కలిసి, అప్పుడప్పుడూ కూతురు శ్లోకతో కలిసి లయ చేస్తున్న డాన్సింగ్ వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ డాన్సింగ్ వీడియోలకు మెస్మరైజ్ అవుతున్న నెటిజన్లు లయను మళ్లీ సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారట. లయ కూడా అదే వుద్ధేశ్యంలో వున్నట్లు తెలుస్తోంది. అయితే, మన ఫిలిం మేకర్స్‌దే ఆలస్యం.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







