నిఖిల్ - చందూ మొండేటి తగ్గేదేలె.!
- June 13, 2022
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నటించిన ‘కార్తికేయ’ సూపర్ డూపర్ హిట్ సినిమా. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ప్యాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. నిఖిల్ కెరీర్‌లోనే మంచి వసూళ్లు రాబట్టిని సినిమాగా ‘కార్తికేయ’ను చెబుతారు.
అందుకే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని అప్పుడే అనుకున్నారట. అందుకు తగ్గట్లుగానే ‘కార్తికేయ 2’ రూపొందింది. ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. ‘కార్తికేయ’ మొదటి సిరీస్‌కి మించిన సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో వుండబోతున్నాయట.
అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే, ఫస్ట్ సినిమాలో హీరోయిన్ అయిన కలర్స్ స్వాతి సెకండ్ పార్ట్‌లో గెస్ట్ రోల్ పోషిస్తోంది. కాగా, ఇంతటితో ఈ సినిమాలు ఆగేదే లేదట. సిరీస్‌లా ‘కార్తికేయ’ సినిమాల్ని రూపొందించాలని చందూ మొండేటి అనుకుంటున్నాడట.
థర్డ్ పార్ట్‌కి సంబంధించి ఓ స్టోరీ లైన్ ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడట చందూ మొండేటి. అయితే, సెకండ్ పార్ట్ రిజల్ట్ తర్వాత మూడో పార్ట్ వెంటనే తెరకెక్కించాలా.? లేక గ్యాప్ తీసుకోవాలా.? అనేది ఆలోచిస్తారట.
మరోవైపు నిఖిల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు సిద్ధంగా వున్నాయ్. వచ్చే నెలలోనే ‘కార్తికేయ 2’ రిలీజ్ అవుతుండగా, ఆ తర్వాత రెండు నెలల గ్యాప్‌లోనే మరో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు యంగ్ హీరో నిఖిల్. అదే ‘18 పేజెస్’. సెప్టెంబర్‌కి ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
అన్నట్లు ఈ సినిమాలోనూ అనుపమా పరమేశ్వరనే హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం. అలాగే ‘స్పై’అనే ప్యాన్ ఇండియా మూవీలో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







