ఖురాన్ కాంటెస్ట్‌కి హాజరైన 400 మంది నాన్ అరబ్స్
- April 09, 2016
రెండవ వార్షిక సల్మాన్ అల్ పార్సి ఖురాన్ కాంపిటీషన్ ఫర్ నాన్ అరబ్స్‌కి 12 దేశాల నుంచి 400 మంది పార్టిసిపెంట్స్ హాజరయ్యారు. మినిస్టర్ ఆఫ్ జస్టీస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్‌మెంట్స్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా హాజరైన ఈ కార్యక్రమం డర్ అల్ అర్కమ్ ఖురానిక్ స్టడీస్ సెంటర్ ఫర్ నాన్ అరబ్స్ వద్ద జరిగింది. ఫ్రెంచ్, రష్యన్, ఇండియన్ మరియు పలు దేశస్తులు ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. 36 ఖురాన్ లెర్నింగ్ సెంటర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. 250 నుంచి 80 బహ్రెయినీ దినార్స్ వరకు వివిధ కేటగిరీల్లో ప్రైజులు కూడా ఉన్నాయి. విజేతలకు మే 28న జరిగే గ్రాండ్ సెర్మనీలో సన్మానిస్తారు. సల్మాబాద్‌లోని గల్ఫ్ ఎయిర్ క్లబ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు గల్ఫ్ ఎయిర్ క్లబ్, ఖలీజి కమర్షియల్ బ్యాంక్, బహ్రెయిన్ ఇస్లామిక్ బ్యాంక్, అసఘర్ అలి పెర్‌ఫ్యూమ్స్, లులు హైపర్ మార్కెట్, మొబిటెల్ మరియు మైగోల్లిస్ ఈ ఈవెంట్‌ని స్పాన్సర్ చేఉ్తన్నాయి.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









