ఆర్మీలో యువతకు అవకాశం..'అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్' ప్రకటన

- June 14, 2022 , by Maagulf
ఆర్మీలో యువతకు అవకాశం..\'అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్\' ప్రకటన

న్యూఢిల్లీ: భారతీయ యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో భారతీయ యువత కోసం కొత్త స్కీమ్‌ను ప్రకటించింది.

అదే 'అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌'. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం (14,2022) ప్రకటించారు. అగ్నిపథ్ స్కీమ్ కింద దేశంలోని యువతను దేశ రక్షణ దళంలోకి తీసుకునే అవకాశం దీని ద్వారా కల్పించబడుతుందని తెలిపారు. కొత్త టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సైన్యంలో చేరే యువత ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈ పథకం కింద యువత నాలుగు సంవత్సరాల పాటు దళాలలో చేరి దేశానికి సేవ చేస్తారు.

అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలోకి సుమారు 45వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. అయితే నాలుగేళ్ల పాటు యువత సర్వీసులో ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్ల సర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు మంచి వేతన ప్యాకేజీ (ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ) ఇచ్చి ఇంటికి పంపిస్తారు.

ఉపాధి గురించి మాట్లాడుతూ..మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'అగ్నిపథ్’ పథకం కింద..సాయుధ దళాల యువత ప్రొఫైల్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది వారికి కొత్త సాంకేతికతలకు శిక్షణ ఇవ్వడానికి..వారి ఆరోగ్య స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com