నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ లో మెస్సేజ్ చేసేయండిలా!
- June 14, 2022
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. అయితే వాట్సాప్ వాడే వారు కొత్త నంబర్ దేనికి అయినా వాట్సాప్ చేయాలంటే..
కాంటాక్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకుని మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇలా వాట్సాప్ చేయాల్సిన ప్రతీ నంబర్ ను కాంటాక్ట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల జాబితా పెద్దది అయిపోతుంది. కొన్ని నంబర్లను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అందుకే దీనికి ఓ పరిష్కారం ఉంది.
కొత్త నంబర్, దాన్ని కాంటాక్టుల జాబితాలో సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. నేరుగా వాట్సాప్ చేయవచ్చు. అందుకు మార్గాలున్నాయి. ముందు మీ ఫోన్ లో ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి.
బ్రౌజర్ సెర్చ్ బార్ లేదా యూఆర్ఎల్ బార్ లో https://wa.me/91 అని టైప్ చేసి స్పేస్ ఇవ్వకుండా ఫోన్ నంబర్ యాడ్ చేసి సెర్చ్ ఓకే చేయండి. వెంటనే వాట్సాప్ యాప్ ఓపెన్ అయ్యి సదరు ఫోన్ నంబర్ తో మెస్సేజ్ ఆప్షన్ తెరుచుకుంటుంది. అప్పుడు ఆ నంబర్ కు వాట్సాప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 9393939393 నంబర్ కు వాట్సాప్ చేయాలని అనుకుంటే.. https://wa.me/919393939393 అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందండోయ్!
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







