ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించిన DGCA
- June 14, 2022
ముంబై: చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్నా విమాన ప్రయాణానికి అనుమతించలేదంటూ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. విమానంలో ఎక్కనివ్వకపోవడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని కూడా అందించకపోవడం పట్ల డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో తమ నిఘా విభాగం అధికారులు తనిఖీలు చేశారని, ఎయిరిండియా తప్పిదాలు గుర్తించామని డీజీసీఏ వెల్లడించింది.
కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు నష్ట పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నా, ఎయిరిండియా ఆ నిబంధనలను పాటించలేదని డీజీసీఏ ఆరోపించింది. దీనిపై ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు పంపామని, వ్యక్తిగత విచారణ సైతం ఏర్పాటు చేశామని తెలిపింది. ఎయిరిండియాలో ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించే విధానం లేదని తెలిసిందని కూడా డీజీసీఏ పేర్కొంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా విధించామని ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







