‘చంద్రముఖి 2’ వచ్చేస్తుందహో.!

- June 14, 2022 , by Maagulf
‘చంద్రముఖి 2’ వచ్చేస్తుందహో.!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంది. నయనతార, జ్యోతిక, ప్రభు ఇతర కీలక పాత్రలు పోషించారు.

‘చంద్రముఖి’.. ఇదో ట్రెండ్ సెట్టర్ మూవీగా అభివర్ణించుకోవచ్చు. ఇప్పటికీ ‘చంద్రముఖి’ అంటే అదో వైబ్రేషన్. జ్యోతిక ఆ పాత్రకు అంతలా న్యాయం చేసింది. ప్రాణం పెట్టేసింది. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ అలాంటిలాంటిది కాదు. ‘చంద్రముఖి’ పాత్రను బేస్ చేసుకుని ఎన్నో మీమ్స్, పేరడీ వీడియోలు.. అలా ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఈ పాత్ర గురించి తక్కువే అవుతుంది.

అలాంటి ‘చంద్రముఖి’ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అదే ‘చంద్రముఖి 2’.  వాస్తవానికి ఇది సినిమాకి సీక్వెల్ అనకూడదేమో. టైటిల్ సీక్వెల్ అంతే. హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లారెన్స్ రాఘవ ఈ సినిమాలో నటిస్తున్నాడు. సీనియర్ దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

‘చంద్రముఖి’ అనగానే ఫీమేల్ లీడ్ రోలే తలపుకు వస్తుంది. మరి, ఆ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు ‘చంద్రముఖి 2’ సినిమాకి అనేది ఆసక్తిగా మారింది. అయితే, ఆ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్.
 
అన్నట్లు ‘చంద్రముఖి’ పాత్రలో దివంగత సౌందర్య, శోభన తదితర నటీమణులు నటించి మెప్పించారు వివిధ భాషల్లో. అలాగే, ఈ సినిమాకి సీక్వెల్ అంటూ విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నాగవల్లి’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క, రీచా గంగోపాధ్యాయ తదితరులు ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com