ప్రవాసులకు వీసా మెడికల్ ఫీజు మినహాయింపు!

- June 15, 2022 , by Maagulf
ప్రవాసులకు వీసా మెడికల్ ఫీజు మినహాయింపు!

మస్కట్: ప్రయివేట్ రంగానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలలో ప్రవాస కార్మికులను వైద్య పరీక్షల రుసుము నుండి మినహాయించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH)కి ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) విజ్ఞప్తి చేసింది. కొత్త వీసాల కోసం వైద్య పరీక్ష తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 2022 నాటి OCCI ధహిరా గవర్నరేట్ బ్రాంచ్ మూడవ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు OCCI ధహిరా అధిపతి సైఫ్ బిన్ సైద్ అల్ బాడి చెప్పారు. చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు సౌకర్యాలను అందించడానికి OCCI రాయల్ ఆదేశాలకు విలువనిస్తుందన్నారు. ఇది వారి సామర్థ్యాలను, వనరులను మెరుగుపరుస్తుందని, GDPకి వారి సహకారాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందని ఆయన తెలిపారు. అలాగే గవర్నరేట్‌లో ప్రైవేట్ రంగ విద్య నాణ్యతను పెంపొందించడానికి - విద్య, నాణ్యత, వృద్ధి - సెమినార్ నిర్వహణను ఆమోదించే తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించినట్లు సైఫ్ బిన్ సైద్ అల్ బాడి తెలిపారు. ప్రవాస కార్మికులందరూ ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత MoH RO30 రుసుముతో మెడికల్ సర్టిఫికేట్‌ను పొందాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com