కువైట్ లోని భారతీయులపై ప్రశంసల వర్షం..

- June 15, 2022 , by Maagulf
కువైట్ లోని భారతీయులపై ప్రశంసల వర్షం..

కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ఆ దేశంలోని ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులను హీరోలుగా అభివర్ణించారు.ఎన్నారైలు చేస్తున్న సేవను కొనియాడారు.

జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్‌తో కలిసి రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన సిబి జార్జ్ మాట్లాడారు.కువైట్ లో ఉన్న రక్తదాతల్లో అత్యధికులు భారతీయ పౌరులే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న భారతీయులను ఆయన హీరోలుగా అభివర్ణించారు.అంతేకాకుండా భారతీయుల సేవను కువైట్ అధికారులు కూడా గుర్తించి, ప్రశంసించినట్టు చెప్పారు.రక్తదానం గురించి భారతీయుల్లో అవగాహన పెంచి, ప్రోత్సహిస్తున్న ఇండియన్ కమ్యూనిటీలను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com