హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

- June 17, 2022 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL), నేడు 2022 స్కైట్రాక్స్ వరల్డ్‌ ఎయిర్‌పోర్టు అవార్డులలో, తాము నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RGIA)  'భారతదేశం మరియు దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది' కలిగిన విమానాశ్రయంగా గుర్తింపు పొందినట్లు ప్రకటించింది.అంతే కాకుండా హైదరాబాద్ విమానాశ్రయం ఓవరాల్ ర్యాంకింగ్‌లో కూడా పురోగమించింది.ప్రపంచ టాప్ 100 ఎయిర్‌పోర్టులలో 2021లో 64వ స్థానం నుండి ఈ ఏడాది 63వ స్థానానికి చేరుకుంది. అదనంగా, హైదరాబాద్ విమానాశ్రయం క్రింది విభాగాలలో ప్రశంసలు పొందింది:

బెస్ట్ రీజనల్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా 2022-2వ స్థానం
బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా 2022-3వ స్థానం
క్లీనెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా 2022-4వ స్థానం
బెస్ట్ రీజనల్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఆసియా 2022-6వ స్థానం
ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోని ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో జరిగిన ఒక కార్యక్రమంలో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధులకు ట్రోఫీని అందజేశారు.

దీనిపై GHIAL CEO ప్రదీప్ పణికర్, “ఈ ప్రతిష్టాత్మక అవార్డును హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న విమానాశ్రయ సిబ్బంది, వాటాదారులు, భాగస్వాములందరికీ అంకితం చేస్తున్నాము. వారి సహకారం, మద్దతు లేకుండా ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో 'ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్' అనే నినాదంతో మా సిబ్బంది అచంచలమైన అంకితభావం, నిబద్ధతతో, ప్రతి ప్రయాణీకుని పట్లా జాగ్రత్త వహించారు. మా  భాగస్వాములందరూ ఒకే లక్ష్యంతో ప్రయాణీకుల కోసం పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణికులకు చిరస్మరణీయమైన అనుభవాన్ని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాము’’ అన్నారు.

విమానాశ్రయ పరిశ్రమలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. వీటిని కస్టమర్‌లు వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వే ద్వారా ఎన్నుకుంటారు. 550 కు పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవ మరియు సౌకర్యాలను అంచనా వేస్తూ, ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్‌మార్క్‌గా ఈ అవార్డులను పరిగణిస్తారు. ఈ సర్వే, అవార్డులు ఏ విమానాశ్రయ నియంత్రణకూ లోబడకుండా స్వతంత్రంగా నిర్వహించబడతాయి. 

6-నెలల సర్వే వ్యవధిలో 100 కంటే ఎక్కువ దేశాల విమానాశ్రయ కస్టమర్లు పూర్తి చేసిన వరల్డ్ ఎయిర్‌పోర్ట్ సర్వే ప్రశ్నాపత్రాల ఆధారంగా అవార్డులు అందించబడ్డాయి. చెక్-ఇన్, రాకపోకలు, బదిలీలు, షాపింగ్, భద్రత మరియు ఇమ్మిగ్రేషన్ నుండి గేట్ వద్ద బయలుదేరే వరకు ఎయిర్‌పోర్ట్ సర్వీస్ యొక్క కస్టమర్ల అనుభవాన్ని, ఉత్పత్తి కీలక పనితీరు సూచికలను ఈ సర్వే ద్వారా పరిశీలించారు. 

విమానయాన పరిశ్రమంలో వరల్డ్ ఎయిర్ పోర్ట్ స్టార్ రేటింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక అంతర్జాతీయ క్వాలిటీ పరిశీలనా సూచిక. దీనిలో విమానాశ్రయాల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా మరియు ప్రొఫెషనల్ అనాలసిస్ ద్వారా నిర్ధారిస్తారు. స్కైట్రాక్స్ 1999లో ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫ్యాక్షన్ సర్వేను ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రపంచ ఎయిర్ పోర్టుల అవార్డులు ఇవ్వడం ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టులలో చెకిన్, అరైవల్స్, ట్రాన్స్ ఫర్స్, షాపింగ్, సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ తదితర చోట్ల ప్రయాణికులకు లభించే ఎయిర్ పోర్ట్ సేవలు మొదలైన వాటి ఆధారంగా సర్వే నిర్వహించి, విజేతలను ప్రకటిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com