నయనతార పెళ్లి వీడియో రేటు అక్షరాలా 50 కోట్లు.?

- June 17, 2022 , by Maagulf
నయనతార పెళ్లి వీడియో రేటు అక్షరాలా 50 కోట్లు.?

సెలబ్రిటీల పెళ్లి వీడియోలూ, ఫోటోలకు వుండే కిక్కే వేరప్పా. తాజాగా సౌత్ క్వీన్‌గా పిలవబడే నయనతార వివాహం అంగ రంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో నయన తార పెళ్లి ముచ్చటకున్న క్రేజ్ వేరే లెవల్.

అందుకే ఆమె పెళ్లి వీడియోకీ ఆ రేంజ్ క్రేజ్ వుంది. అది ముందే గమినించిన నయన తార, తన పెళ్లి వీడియో షూటింగ్ బాధ్యతలు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌ని అప్పగించిందంటూ ప్రచారం జరిగింది.

జూన్ 9న తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన తార పెళ్లి మహా బలిపురంలో జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి. కానీ, వీడియో ఫుటేజ్‌లు ఏమీ ఇంతవరకూ బయటకి రాలేదు.

అయితే, ఈ వీడియో ఫుటేజ్ హక్కుల్ని ఓ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని తాజాగా తమిళ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. అక్షరాలా 50 కోట్లు వ్యత్యించి సదరు ఓటీటీ సంస్థ ఈ వీడియో హక్కులు దక్కించుకుందట.

అమ్మో 50 కోట్లా.? ఓ మోస్తరు చిన్న సినిమా తెరకెక్కించేయగల బడ్జెట్ అన్న మాట. మరి, నయన తార పెళ్లి వీడియో అంటే, ఆ మాత్రం ఖర్చవ్వుద్ది. అంతేనా. నయన తార రేంజ్‌కి ఇది చాలా చిన్న అమౌంటే.. అనే అభిప్రాయాలు కూడా కొందరిలో వున్నాయట. ఇది ఇంకా ఆశ్చర్యం కదా.
గతంలో కాజల్ అగర్వాల్ పెళ్లి వీడియో కూడా ఇలాగే భారీ మొత్తానికి అమ్మేసుకుందనే ప్రచారం జరిగింది. ఈ అమ్ముకోవడాల్లో నిజమెంతో కానీ. అదేదో సినిమాలో చెప్పినట్టు.. ఈ డబ్బున్నోళ్ల కష్టాలు ఎవరికీ అర్ధం కావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com