సౌదీ ఎడారిలో దాహంతో తండ్రీ కొడుకులు మృతి

- June 18, 2022 , by Maagulf
సౌదీ ఎడారిలో దాహంతో తండ్రీ కొడుకులు మృతి

సౌదీ: సౌదీ అరేబియాలోని అజ్మాన్ వ్యాలీ ఎడారిలో ఒక కువైట్ వ్యక్తి, అతని 8 ఏళ్ల కుమారుడు దాహంతో మరణించిన ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు తమ గొర్రెలు మేపుకుంటూ ఎడారిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి వస్తుండగా, వారి వాహనం ఇసుకలో చిక్కుకుందని, ఆ సమయంలో వారు సహాయం కోసం ఎవరినీ సంప్రదించలేకపోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఇసుకలోంచి వాహనాన్ని బయటకు తీయడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఆ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్రత్ మొఘటి ప్రాంతానికి కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలోనే దాహంతో వారు చనిపోయారు. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఎడారి ప్రాంతంలో డీహైడ్రేషన్ కారణంగా వారు అపస్మారక స్థితికి చేరుకుని మరణించారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. తన కారు చెడిపోయిందని, దాన్ని సరిచేసుకొని వస్తానని తమకు తెలిపినట్లు వారు వివరించారు. అనంతరం ఫోన్ కల్వకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తండ్రిబిడ్డల కోసం ఎడారిలో వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మరణించిన తండ్రి, చిన్న పిల్లల మృతదేహాలను గుర్తించినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com