రూ.86 లక్షల బంగారం స్మగ్లింగ్.. హైదరాబాద్‌లో కువైట్ మహిళ పట్టివేత
- June 18, 2022
కువైట్: కువైట్ నుండి ఇండియాలోని హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 86 లక్షల రూపాయల విలువైన 1.646 కిలోల బంగారాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుండి J9403 విమానంలో వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుండి బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో షూ లోపల సాక్స్, నల్లటి ప్లాస్టిక్ కవరింగ్‌లో దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







