కొత్త కాంబో గురూ.! ఎన్టీయార్ సరసన నాని హీరోయిన్.?
- June 18, 2022
ఎన్టీయార్ - కొరటాల కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాకి హీరోయిన్ వేట కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరగింది. కానీ, అదంతా తూచ్.! అని స్వయంగా జాన్వీకపూరే తేల్చేసింది.
ఆ తర్వాత పూజా హెగ్దే అనుకున్నారు. కానీ, అది కూడా ఉత్త ప్రచారమే అని తేలింది. రష్మిక మండన్నా పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. రష్మిక మండన్నా - ఎన్టీయార్ కాంబినేషన్ కూడా ఇంతవరకూ సెట్ కాలేదు. కేవలం ప్రచారంలోనే వుంది. అలా ఈ సినిమాతో ఆ కాంబో సెట్టవవ్వబోతోందని అనుకున్నారు. కానీ, అదీ కుదరలేదు.
తాజాగా అనూహ్యంగా ఓ ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, ప్రియాంక అరుల్ మోహనన్. నేచురల్ స్టార్ నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. మంచి నటి. తొలి సినిమాతోనే హిట్టు కూడా కొట్టింది. ఆ తర్వాత శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమా చేసింది.
ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా వుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి ప్రియాంక మోహనన్‌కి. అయితే, ఎన్టీయార్ సినిమా ఎలా లైన్లోకి వచ్చిందన్న అంశం కాస్త ఇంట్రెస్టింగ్గా వుంది. ప్రియాంకను తన సినిమాలో పెట్టుకోమని, ఎన్టీయార్‌కి ఫ్యాన్స్ సూచిస్తున్నారట.
పెయిర్ ఫ్రెష్‌గా వుంటుందనో, లేక మరేదైనా కారణమో తెలీదు. కానీ, కొత్త కాంబినేషన్ అయితే సెట్ అవ్వబోతోంది. మరి, ఫ్యాన్స్ కోరిక మేరకు ప్రియాంకకు ఆ ఛాన్స్ ఇస్తాడా ఎన్టీయార్.? ఒకవేళ ఇస్తే, ప్రియాంక దశ తిరిగిపోయినట్లే. స్టార్ హీరోయిన్ దిశగా అమ్మడి అడుగులు మొదలైనట్లే.!
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







