దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ కీలక ప్రకటన..
- June 19, 2022
దుబాయ్: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ప్రవాసుల అభ్యర్థన మేరకు జూన్ 26న పాస్‌పోర్ట్ సర్వీస్ శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.దుబాయ్‌తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్‌లోని 12 BLS ఇంటర్నెషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్స్‌లో ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ప్రవాసులు పాస్‌పోర్ట్, దాని సంబంధిత సమస్యలను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. "ప్రవాస భారతీయుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని పాస్‌పోర్ట్, దాని సంబంధిత సేవల డిమాండ్‌ను తీర్చడానికి ఈ పాస్‌పోర్ట్ సేవా శిబిరం నిర్వహించబడుతుంది" అని భారత కాన్సుల్ మీడియాకు తెలిపింది.
కాగా, ఈ సర్వీస్‌ను ఉపయోగించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుగానే బీఎల్ఎస్ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అపాయింట్మెంట్లో పేర్కొన్న సమయానికి సంబంధిత బీఎల్ఎస్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో దానికి సరిపోయే ధృవపత్రాలను కూడా జతచేయాలి. తద్వారా పాస్‌పోర్ట్, దాని సంబంధిత సమస్యలను ప్రవాసులు పరిష్కరించుకోవచ్చు.
ఇక ధృవపత్రాలతో కూడిన కొన్ని కేసులు నేరుగా సర్వీస్ పొందేందుకు అంగీకరించబడతాయని ఈ సందర్భంగా భారతీయ మిషన్ తెలిపింది. 'తత్కాల్' కేసులు, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం), కొత్తగా పుట్టిన బిడ్డ, సీనియర్ సిటిజన్లు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, అవుట్ పాస్‌లు. ఏవైనా సందేహాల ఉంటే.. ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం టోల్ ఫ్రీ నంబర్: 80046342 లేదా [email protected]; [email protected]కు ఈ-మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







