గోల్డెన్ వీసా పొందేందుకు ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థ సహాయం చేస్తుందా ?

- June 19, 2022 , by Maagulf
గోల్డెన్ వీసా పొందేందుకు ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థ సహాయం చేస్తుందా ?

ప్రశ్న: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, నేను పనిచేసే కంపెనీ వారు ఈ వీసా పొందేందుకు  సహాయనిరాకరణ చేస్తున్నారు.ఉద్యోగి యెక్క నియామక ఖర్చులు భరించడం సంస్థ భాధ్యత కదా? ఇలాగైతే ఎలా ?  

సమాధానం: మీరు పైన పేర్కొన్న దాని ప్రకారం యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ లో ఉపాధి పొందడం జరిగింది. 

అందువలన, ఫెడరల్ డిక్రీ చట్టం నంబర్ 33 పరిధిలోని ఉపాధి చట్టం 2021 మరియు క్యాబినెట్ నూతన సవరణల నిబంధనలతో కూడిన ఉద్యోగి సంబంధాల నియంత్రణ చట్టం 2021ల ద్వారా మీ పై ప్రశ్నకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 

2018లో యూఏఈ క్యాబినెట్ నిర్ణయం నంబర్ 56 లో నిర్దేశించబడిన గోల్డెన్ వీసా పొందేందుకు నిర్ణయించిన అర్హతల ప్రకారం పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, నివాసితులు మరియు విభిన్న కళలలో ప్రతిభావంతులైన వారు స్వయం ప్రతిపత్తి ద్వారా వీసా పొందుతారు.అలాగే, సాధారణంగా యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగలు వీసా పొందేందుకు వారి సంస్థ వారే ఆయా ఖర్చులు భరించడం జరుగుతుంది.అలాగే , వేరొకరి (Third party) ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు గోల్డెన్ వీసా పొందేందుకు యజమాని సహాయం చేయనక్కర్లదు. 

 యూఏఈ లో గోల్డెన్ వీసా కలిగి ఉన్న (అతడు/ఆమె) వారికి ఏమిరైటైజేషన్ మరియు మానవ వనరుల మంత్రిత్వశాఖ వర్క్ పర్మిట్ ఇవ్వడం జరుుతుంది. అది కూడా ఉద్యోగి యెక్క ప్రస్తుత యాజమాని లేదా భవిష్యత్తు యజమాని మంత్రిత్వశాఖ కు దరఖాస్తు చేస్తేనే. 
 
 2022 క్యాబినెట్ నిర్ణయం నంబర్ 1 యెక్క ఆర్టికల్ 6(1) ఏం చెబుతుంది అంటే " డిక్రీ చట్టం లోని ఆర్టికల్ 6 లోని నిబంధనల మేరకు  గోల్డెన్ వీసా కలిగి ఉన్న యాజమాని లేదా సంస్థ సదరు మంత్రిత్వశాఖలో నమోదు చేసుకోవడం ద్వారా యూఏఈ లో పనిచేయడానికి తమ ఉద్యోగికి గోల్డెన్ వీసా వర్క్ పర్మిట్ ఇప్పించేందుకు అభ్యర్థించవచ్చు". 

ఉపాధి చట్టం లోని ఆర్టికల్ 6(4) ప్రకారం, "తన కింద పనిచేసే ఉద్యోగి మీద ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియామక మరియు ఇతరత్రా ఖర్చులను యాజమాని/సంస్థ వసూలు చేయకూడదు". ఆరోగ్య బీమా, నివాస వీసా, యూఏఈ ఏమిరేట్స్ గుర్తింపు కార్డు మరియు వర్క్ పర్మిట్ లకు సంబంధించిన తదితర ఖర్చులన్ని నియామక ఖర్చుల్లో భాగమేనని పేర్కొనడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com