ఇథియోపియాలో 230 మంది మృతి..
- June 20, 2022
ఇథియేపియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది.. తాజాగా జరిగిన ఘర్షణలో సుమారు 230 మంది మరణించారు. వీరంతా అమ్హారా తెగకు చెందిన వారేనని తెలిసింది. ఆ దేశానికి చెందిన పలు వార్తా కథనాల ప్రకారం.. ఇథియోపియన్ తిరుగుబాటు బృందం ఆదివారం 230 మందికి పైగా అమ్హారా జాతి సభ్యులను ఊచకోత కోసింది. ఇథియోపియాలోని అతిపెద్ద ప్రాంతమైన ఒరోమియాలోని టోలే అనే గ్రామంపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ సభ్యులు దాడి చేయడంతో 230 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు అసోసియేటెడ్ మీడియాతో చెప్పారు.
ఒరోమో లిబరేషన్ ఆర్మీ(OLA) అని పిలువబడే తిరుగుబాటు సంస్థ. ఇథియోపియన్ ప్రభుత్వం OLAను తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవల కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి. తాజాగా జరిగిన ఘటన అతిపెద్దదిగా స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. శనివారం జరిగిన దాడి నుంచి తృటిలో తప్పించుకున్న గింబీ కౌంటికీ చెందిన అబ్దుల్ సీద్ తాహీర్ మాట్లాడుతూ.. మేం మా జీవిత కాలంలో చూసిన పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని అన్నాడు.
ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మమ్మల్ని తరలించాలని అమ్హారా తెగ ప్రజలు కోరుతున్నారని షాంబెల్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇదిలా ఉంటే 2020 నవంబర్ నుండి ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఉత్తర ప్రాంతంలో తిగ్రేలో ప్రారంభమైన తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించడం ప్రారంభించినప్పటి నుండి దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఘోరమైన జాతి హింసలో ఈ దాడి ఒకటి అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అయితే తాజా మారణ హోమానికి ఒరేమో లిబరేషన్ ఆర్మీనే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడిస్తున్నారు.అయితే ఆరోపణలను ఒరేమో లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







