మంగళవారం ఈ ఏడాదిలోనే సుదీర్ఘమైన పగటి సమయం

- June 20, 2022 , by Maagulf
మంగళవారం ఈ ఏడాదిలోనే సుదీర్ఘమైన పగటి సమయం

యూఏఈ: యూఏఈలో స్ప్రింగ్ సీజన్(శీతాకాలం) నేటితో అధికారికంగా ముగుస్తోంది.రేపటి నుంచి సమ్మర్ సీజన్(వేసవికాలం) ప్రారంభం కానుంది. ఎమిరేట్స్ ఆస్ట్రనామికల్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, స్ప్రింగ్ సీజన్ ముగిసిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సుమారు మూడు నెలలపాటు వేసవి వుంటుందని ఆయన తెలిపారు. జూన్ 21న వేసవి ప్రారంభం కానుండగా, సుమారు 14 గంటలపాటు పగటి సమయం తొలి రోజు వుంటుందని అన్నారు. ఈ ఏడాదిలో ఇదే సుదీర్ఘమైన పగటి సమయం. పగటి పూట ఉష్ణోగ్రత ఎక్కువగా వుంటుంది. కొన్ని చోట్ల ఆకాశం మేగావృతమై వుండొచ్చు. శుక్రవారం తేలికపాటి వర్షం కురిసే అవకాశం వుంది. ఈ సీజన్‌లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com