పవన్ సినిమా విషయంలో ఈ సారి గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్

- June 21, 2022 , by Maagulf
పవన్ సినిమా విషయంలో ఈ సారి గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా తెరకెక్కాల్సి వుంది. ఎప్పుడో ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు హరీష్ శంకర్. కానీ, వరుస సినిమాలతో ఓ పక్క, రాజకీయ రగడతో ఇంకో పక్క, పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా వున్నాడు. దాంతో ఈ సినిమా అటకెక్కిపోయినట్లేనట.. అంటూ ఎప్పటికప్పుడే రూమర్లు పుట్టుకొస్తున్నాయ్. వాటిని తనదైన శైలిలో హరీష్ శంకర్ తిప్పి కొడుతూనే వున్నాడు. పవన్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సెట్స్‌లో వున్నప్పుడే అప్పుడప్పుడూ హరీష్ శంకర్ కూడా పవన్‌ని కలిసి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలూ నెట్టింట్లో షేర్ చేస్తూ, మా కాంబో మూవీపై ఇదిగో ఇదే అప్‌డేట్ అనేలా హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ శంకర్.

మొన్న నాని సినిమా ‘అంటే సుందరానికి.!’ సినిమా ఫంక్షన్‌లోనూ ముఖ్య అతిధిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్‌తో పాటు, హరీష్ శంకర్ కూడా హాజరయ్యాడు. ఆ వేదికగా ‘భవదీయుడు భగత్ సింగ్’ గురించి ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు.

అయినా కానీ, రూమర్లు ఆగడం లేదు ఈ సినిమాపై. తాజాగా తన ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ స్పందించారు. కేసీయార్ మాట్లాడుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేసి, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాపై నెక్స్‌ట్ లెవల్ క్లారిటీ గట్టిగా ఇచ్చారు హరీష్ శంకర్.

‘కేసీయార్ మార్క్ పనికిమాలిన వెధవలు..’ అనే డైలాగ్ ఈ వీడియోలో వుంది. అదేనండీ.. పనీ పాటా లేని వాళ్లు ఏదేదో మాట్లాడుతుంటారు. వాటిని పట్టించుకోకూడదు..’ అనేదే ఆ మాటల్లోని సారాంశం అన్నామాట. ఈ వీడియో క్లిప్ చూశాకా అయినా, ఆ రూమర్ వీరులు నోరులు మూస్తారేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com