‘మెట్రో మెడ్లీ ’ ప్రారంభించిన ఎల్ & టీ ఎంఆర్హెచ్ఎల్
- June 21, 2022
హైదరాబాద్: అంతర్జాతీయ సంగీత దినాన్ని వేడుక చేస్తూ ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ –టీ ఎంఆర్హెచ్ఎల్) వినూత్న కార్యక్రమాలకు తెరతీసింది. గోతె జెంత్రం హైదరాబాద్ మరియు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో కలిసి మెట్రో మెడ్లీ శీర్షికన బుస్కింగ్ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కళలు మరియు సంస్కృతిని వేడుక చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అంకితం చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమమిది. తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణి జ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మెట్రో మెడ్లీ కార్యక్రమం ప్రారంభించారు.
అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్ &టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ –సీఈవో కెవీబీ రెడ్డి, గోతె జెంత్రం డైరెక్టర్ అమితా దేశాయ్ తో పాటుగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణి జ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ‘‘మెట్రోమెడ్లీ కార్యక్రమం ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాను.దీనిలో భాగంగా గోతె–జెంత్రం ఐదు మెట్రో స్టేషన్లలో బస్కింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతుంది.ఈ కార్యక్రమాలు మెట్రో ప్రయాణీకులకు మరింత ఆహ్లాదం కలిగించనున్నాయని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని సంగీతం అందిస్తుంది.అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని వేడుక చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. దీనిద్వారా కళలు, సంస్కృతిని ప్రోత్సహించనున్నారు’’ అని అన్నారు.
ఎల్ & టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరవాసులు ఈ ఆహ్లాదకరమైన సంగీత వారోత్సవాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం