బిడ్డను వదిలేసిన మహిళను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు
- June 23, 2022
షార్జా: రెండు నెలల శిశువును షార్జా లోని అనాథ ఆశ్రమం(ఛారిటీ సెంటర్) లో వదిలేసిన మహిళను కేవలం 5గంటల్లోనే శిశు సంరక్షణ కేంద్రం సహకారంతో షార్జా నేర పరిశోధన శాఖకు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు.
సాయంత్రం 5 గంటల సమయంలో రెండు నెలల శిశువును అనాథ ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు గుర్తించిన ఆశ్రమ నిర్వహకులు షార్జా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే నగరంలోని సీసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా బిడ్డ తల్లి ఆశ్రమం ప్రధాన కార్యాలయంలో ప్రవేశించి అక్కడ తన బిడ్డను వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది.ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారుల బృందం మరియు శిశు సంరక్షణ కేంద్రం ప్రతినిధులు ఆశ్రమంలో ఉన్న బిడ్డను పరిశీలించి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
అలాగే మరోవైపు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితురాలి కోసం అన్వేషణ మొదలు 5గంటల్లోనే ఆమె ఆచూకీ లభ్యమైంది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రతా అధికారి కల్నల్ ఒమర్ బు అల్ జూద్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు